*INCOME TAX 2016-17*
1).2,50,000 వరకు - పన్నులేదు.
2).2,50,001 నుండి 3,00,000 వరకు - 10%.
3).3,00,001 నుండి 5,00,000 వరకు - 5,000 + 10%
4).5,00,001 నుండి 10,00,000 వరకు - 25,000 + 20%
5).10,00,000 పైన - 1,25,000 + 30%
ముఖ్య గమనిక :-
వార్షిక ఆదాయం మొత్తం ₹ 5 లక్షలు మించని వారికి చెల్లించవలసిన ఆదాయపు పన్ను నుండి మరో ₹ 2 వేలు మినహాయింపు లభిస్తుంది.
•••••••••••••••••••••••
* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1)
ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి
••••••••••••••••••••••••••
HRA మినహాయింపు :
Under Section 10(13A)
ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే
ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
1.పొందిన ఇంటి అద్దె బత్యంమొత్తం
2.ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం
(రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెన్షన్ కి పరిగణించరు కనుక
డి. ఎ ను కలుపనవసరం లేదు)
3.40% వేతనం ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-
(సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు
మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదుDDO కు సమర్పించాలి.
చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో
ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు.
•••••••••••••••••••••••••
మినహాయింపులు :
1.ఇంటి ఋణం పై వడ్డి (Section24):
ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.
2.ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E) :Self, Spouse, Children ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై 2015-16 ఆర్ధిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 7 సం. లు వర్తిస్తుంది.
3.ఆదారపడిన వారు వికలాంగులయితే (80DD): ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు.
80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి.
4.ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80u).
6.చందాలు (80G) :
PM, CMరిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు.
••••••••••••••••••••••••••
మెడికల్ ఇన్సురెన్స్ (80D) : ఉద్యోగి తన కుటుంబంకోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి కాని కుటుంబం కోసం కాని పేరెంట్స్ కోసం కాని హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు.
••••••••••••••••••••••••••5
పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష :
1. సేవింగ్స్ (80C) :
GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ. 1.5 లక్ష వరకు5 మినహాయింపు కలదు.
* 80C, 80CCC, 80CCD ల పొదుపు ల పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది.
అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS (80CCG) :
Rajiv Gandhi Equity Saving Scheme ద్వారా 1.5లక్షలకి అదనముగా మినాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయము 10 లక్షలలోపు ఉన్నవారు గరిష్టంగా 50,000/- వరకు పొదుపు చెయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో సగం (50%) ను మినహాయిస్తారు అంటె గరిష్ట మినహాయింపు 25,000/- వరకు పొందొచ్చు.
సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA) :
సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.
No comments:
Post a Comment