ఆధార్ తో మరెవరైనా SIM కార్డ్ వాడుతున్నారని డౌటా? లేదా ఎన్ని మొబైల్ నంబర్స్ మీ పేరు మీద యాక్టివ్ గా ఉన్నాయి? అని ఎపుడైనా మీకు అనిపించిందా. నిజానికి, మీ పేరు మీద ఇప్పటికీ ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకోవడం చాలా సులభం. ఇప్పటి వరకూ వినియోగధారులకు దీని పైన పూర్తి ఇంఫర్మేషన్ తెలుసుకొనే అవకాశం లేనప్పటికీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) కొత్తగా తీసుకొచ్చిన టెలికం అనలైటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్ మెంట్ మరియు కన్స్యూమర్ ప్రొటక్షన్ (TAFCOP) నుండి మీకు సంబంధించిన అన్ని మొబైల్ నంబర్ల వివరాలను ఇన్స్టాంట్ గా తెలుసుకోవచ్చు. దీనికోసం, ముందుగా మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, ఇక్కడ సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి
No comments:
Post a Comment